Fri Dec 05 2025 13:18:28 GMT+0000 (Coordinated Universal Time)
మోడీ నీ ప్రభుత్వం అంత అవినీతి మరే ప్రభుత్వంలోనూ లేదు
ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు

ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఏపీలో రాదని, బంగాళాఖాతంలో వస్తుందని అన్నారు. కేంద్రంలో తమ పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలని బొత్స సత్యనారాయణ అన్నారు. మోదీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని, రైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడాడరన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ తోడు దొంగలని, ఒకడు తానా అంటే ఇంకొకడు తందనా అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఎవరో రాసిస్తే...
సమోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదని, అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోయారన్నారు బొత్స సత్యనారాయణ. ఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి.. దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదన్నారు. తన రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదన్నారు. మోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారని, మోదీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదరిచ రాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Next Story

