Thu Jan 29 2026 06:29:04 GMT+0000 (Coordinated Universal Time)
అచ్చెన్నకు బుర్ర లేదు.. ఆ పార్టీకి విధానం లేదు
ఈ నెల 15న విశాఖ గర్జనను విజయవంతం చేద్దామని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు

ఈ నెల 15న విశాఖ గర్జనను విజయవంతం చేద్దామని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రకు పరిపాలన రాజధాని వచ్చేంత వరకూ పోరాటం చేయాలని ఆయన కోరారు. 12న అన్ని వార్డుల్లోనూ మానవహారాలు చేయాలన్నారు. అచ్చెన్నాయుడు తనకు బుర్ర లేదంటున్నారని, కానీ బుర్ర ఉంటే ఎందుకు ఉత్తరాంధ్రకు అభివృద్ధి వద్దంటున్నావని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 26 జిల్లాల అభివృద్ధి థ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
విశాఖను అభివృద్ధి చేసింది?
ఏ పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కువ రోజులు అధికారంలో ఉందని బొత్స సత్యనారాయణ నిలదీశారు. తెలుగుదేశం ఎక్కువ రోజులు అధికారంలో ఉండి ఉత్తరాంధ్రకు ఏం చేసిందని ఆయన అన్నారు. అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటూ రోజులు గడుపుకుంటుందని బొత్స మండి పడ్డారు. ఈ ప్రాంతానికి నీవు ఉద్ధరించిందేమిటని ఆయన నిలదీశారు. విశాఖపట్నం అభివృద్ధి చెందింది రాజశేఖర్ రెడ్డి హయాంలోనేనని ఆయన అన్నారు. టీడీపీ నేతలు సహనం కోల్పోతున్నారని అన్నారు.
Next Story

