Thu Dec 18 2025 18:00:23 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఆ నలుగురూ వీరే !
ఇటీవలే రాజీనామా చేసిన విజయసాయిరెడ్డికి మరోసారి ఆ అవకాశం కల్పించారు. బీసీ కేటగిరీలో రాజ్యసభ అభ్యర్థులుగా ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు

అమరావతి : దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలను భర్తీ చేస్తూ.. ఇటీవల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. వాటిలో ఏపీ నుంచి 4 ఎంపీ స్థానాలు భర్తీ కానున్నాయి. భర్తీ కానున్న ఆ నాలుగు స్థానాల అభ్యర్థులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ఆ నలుగురి పేర్లను మంత్రి బొత్స సత్యనారాయణ కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. ఇద్దరు బీసీ, ఇద్దరు ఓసీ కమ్యూనిటికి చెందిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు.
రాజ్యసభ ఎంపీగా ఇటీవలే రాజీనామా చేసిన విజయసాయిరెడ్డికి మరోసారి ఆ అవకాశం కల్పించారు. బీసీ కేటగిరీలో రాజ్యసభ అభ్యర్థులుగా ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు లను ఎంపిక చేసినట్లు బొత్స వెల్లడించారు. బీసీల గళాన్ని రాజ్యసభలో వినిపించాలన్న ఉద్దేశంతోనే ఆర్ కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఓసీ కేటగిరీలో విజయసాయిరెడ్డితో పాటు.. న్యాయవాది నిరంజన్ రెడ్డిని రాజ్యసభ్య అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు బొత్స పేర్కొన్నారు.
News Summary - Minister botsa satyanarayana announced 4 rajyasabha candidates from ysrcp
Next Story

