Sun Mar 15 2026 16:44:32 GMT+0530 (India Standard Time)
జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం
జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు

జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. మంత్రులు త్యాగాలకు సిద్ధం కావాల్సిందేనని చెప్పారు. ఇదేదో కొత్తగా జగన్ చెప్పింది కాదని, తొలి పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని జగన్ చెప్పారన్నారు. అనేక మంది మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తుండటం సహజమని చెప్పారు. సామాజికవర్గాల సమీకరణ కూడా అంతే ముఖ్యమని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపునకు....
జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. కొందరిని పార్టీ అవసరాల కోసం వాడుకుంటామని జగన్ చెప్పారని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరోసారి అవకాశమిస్తానని కూడా జగన్ స్పష్టం చేశారని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా అందరం కలసి పదవులను పక్కన పెట్టి పని చేయాలని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
Next Story

