Sat May 18 2024 04:42:07 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల పార్టీపై బాలినేని ఏమన్నారంటే?
షర్మిల ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏపీలో తాను పార్టీ పెడతానని చెప్పలేదన్నారు
వైఎస్ షర్మిల ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏపీలో తాను పార్టీ పెడతానని చెప్పలేదని షర్మిల చెప్పలేదన్నారు. షర్మిల కూడా వైఎస్సార్ కుటుంబంలో భాగమేనని అన్నారు. కొన్ని అభూత కల్పనలను ఒక వర్గం మీడియా సృష్టిస్తుందని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
వైఎస్ కుటుంబంలో....
వైఎస్ షర్మిల ఇటీవల మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో పార్టీ పెట్టకూడదా? అని ప్రశ్నించారు. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు అని ఆమె అన్నారు. దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆమె వైఎస్సార్ కుటుంబంలో ఒక భాగమని మంత్రి చెప్పారు.
Next Story