Tue Dec 16 2025 23:48:33 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ పెద్ద అహంభావి
తనపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు

తనపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో మాత్రమే హీరో అని, తాను రాజకీయంగా హీరోనని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ కు అహంభావం ఎక్కువని అవంతి చెప్పారు. పవన్ కల్యాణ్ నటించిన సినిమాలు హిట్ ల కన్నా ప్లాప్ లే ఎక్కువ ఉన్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదవటం తప్ప పవన్ కల్యాణ్ కు మరేదీ చేతకాదన్నారు.
నిరూపిస్తే రాజీనామా...
తాను ఎవరిపైనైనా రౌడీయిజం చేసినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. అనవసర ఆరోపణలు చేయడం పవన్ కల్యాణ్ కు ఇదేమీ కొత్త కాదన్నారు. టీడీపీతో పొత్తు ఎందుకు తెంచుకున్నారు? మళ్లీ ఎందుకు ఇప్పుడు తాపత్రయ పడుతున్నారో చెప్పాలని అవంతి డిమాండ్ చేశారు. నిన్న జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్.. బంతి.. చేమంతి.. గోడకు కొట్టిన బంతి.... అవంతి అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Next Story

