Sun Mar 15 2026 19:05:02 GMT+0530 (India Standard Time)
ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. ఏపీ మంత్రి
మంత్రి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని ఆయన అన్నారు.

మంత్రి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని ఆయన అన్నారు. కార్యకర్తలు, నేతలు సిద్ధంగా ఉండాలని అప్పలరాజు పిలుపు నిచ్చారు. అందుకే తాము ప్రచారంలో పాల్గొంటున్నామని అప్పలరాజు తెలిపారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని విపక్షాలు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అప్పలరాజు కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఎవరు ఇంటికి వచ్చినా...
మంత్రి అప్పలరాజు పక్కనే మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఉన్నారు. అందరూ సిద్ధంగా ఉండాలని, కార్యకర్తలు ఎప్పుడు వచ్చినా తన ఇంటి తలుపులు తెరుచుకుని ఉంటాయని అప్పలరాజు తెలిపారు. నియోజకవర్గంలోని అభివృద్ధి తప్ప మరే అంశంపైనా తాను దృష్టి పెట్టడం లేదని ఆయన అన్నారు.
Next Story

