Sun Dec 07 2025 10:50:58 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీకి మంత్రి అనిల్ ఛాలెంజ్
శాసనమండలిలో మంత్రి అనిల్ కుమార్ టీడీపీకి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయగలరా? అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంత్రి అనిల్ కుమార్ టీడీపీకి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయగలరా? అని ప్రశ్నించారు. తమ అధినేత జగన్ వైసీపీని ఒంటరిగానే పోటీ చేయిస్తారని, పొత్తులు లేకుండా టీడీపీ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగగలదా? అని నిలదీశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యనే అనిల్ ఈ ఛాలెంజ్ విసిరారు. వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుందని, టీడీపీ కి ఆ ధైర్యం లేదని చెప్పారు.
పొత్తు లేకుండా.....
పొత్తు లేకుండా పోటీ చేస్తామని టీడీపీ ప్రకటించాలని సవాల్ విసిరారు. గతంలో తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగానే సభకు తిరిగి వస్తానని ప్రజాక్షేత్రంలోకి వెళ్లారని, తాము కూడా అసెంబ్లీకి రాలేదన్న విషయన్ని అనిల్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు. కానీ చంద్రబాబు శపథాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టించుకోలేదని, తాము మాత్రం సభకు వస్తున్నారని అనిల్ ఎద్దేవా చేశారు.
- Tags
- anil kumar
- tdp
Next Story

