Thu Mar 19 2026 11:56:20 GMT+0530 (India Standard Time)
చంద్రన్న హాలిడే ప్రకటించాలి : అంబటి
కొత్తగా వచ్చే పార్టీలతో తాము భయపడేది లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

కొత్తగా వచ్చే పార్టీలతో తాము భయపడేది లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కేసీఆర్ తో ఒక ముఖ్యమంత్రిగా తమ సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు. ఎన్ని పార్టీలొచ్చినా వైసీపీ విజయాన్ని ఆపలేరన్నారు. ఎవరు పార్టీ పెట్టినా అధికారంలోకి రావాలనే పార్టీ పెడతారని ఆయన అన్నారు. కేఏ పాల్ కూడా అధికారంలోకి వస్తామని చెప్పారు. పవన్ కల్యాణ్ తప్ప అందరూ అదే మాట చెబుతారన్నారు. ఎన్నికలకు ముందు పార్టీలు పుడతాయని, తర్వాత పోతాయని అంబటి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని ఆయన అన్నారు.
దుప్పట్లను పంచే దుస్థితి...
రోడ్ షోలకు, ర్యాలీలకు చంద్రన్న హాలిడే ప్రకటించాలని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఎందుకు అనుమతులు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. జనం చచ్చిపోతుంటే రోడ్ షోలపై నిషేధం విధించరా? అని అంబటి నిలదీశారు. రాజకీయ లబ్ది కోసం దుప్పట్లను పంచే స్థాయికి దిగజారి పోయారని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఇక కొంత కాలం పాటు సభలను పెట్టడం ఆపుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు.
Next Story

