Sun Feb 01 2026 22:31:06 GMT+0000 (Coordinated Universal Time)
కన్నాకు అంబటి వార్నింగ్
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరితే ఎవరికీ ఎలాంటి నష్టం లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు

కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరితే ఎవరికీ ఎలాంటి నష్టం లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కన్నా తిన్నంటి వాసాలు లెక్కపట్టే వ్యక్తి అని అన్నారు. కాంగ్రెస్ లో చేరి మంత్రి పదవులు అనుభవించి చివరికి దానికి రాజీనామా చేసి చివరి క్షణంలో బీజేపీలో చేరాడని అంబటి రాంబాబు అన్నారు. అలాగే బీజేపీలో కన్నాను ఎందుకు అధ్యక్ష పదవి నుంచి తొలగించారో అందరికీ తెలుసునని చెప్పారు.
సీఎంను అంటే...
బీజేపీలో తిన్నంటి వాసాలు లెక్కపెట్టి తిరిగి ఇప్పుడు టీడీపీలో చేరారన్నారు. టీడీపీలో చేరడంతో కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా నైతిక విలువలను కోల్పోయినట్లయిందన్నారు. ఆయన గురించి ఎవరూ ఇక్కడ ఆలోచించడం లేదన్నారు. అయితే ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని కన్నాను అంబటి రాంబాబు హెచ్చరించారు. తమ ముఖ్యమంత్రిని జగన్ ఏదైనా అంటే వైసీపీ కార్యకర్తలు ఎవరూ ఊరుకోరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు అంబటి రాంబాబు. ఆయన రాజకీయంగా పూర్తిగా చచ్చిపోయినట్లేనని అంబటి అన్నారు.
Next Story

