Fri Dec 05 2025 19:14:23 GMT+0000 (Coordinated Universal Time)
Ambati : పవన్ పై అంబటి ఫైర్.. ఆయన లాంటి నేత
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఒకపార్టీతో పొత్తులో ఉండి మరొక పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే ఎవరైనా తిడతారన్నారు. ప్రజాస్వామ్యం పై ఉన్న నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తితోనూ తిట్లు తినాల్సిందేనని అన్నారు. పవన్ లాంటి అనైతిక రాజకీయ నేత మరొకరు ఉండరని అంబటి రాంబాబు అన్నారు. ఓట్లు కొనుక్కోమంటూ పార్టీ నేతలకు లైసెన్స్ ఇచ్చారని అంబటి రాంబాబు అన్నారు.
ఒరిగేది లేదంటూ...
పవన్ కల్యాణ్ వల్ల ఒరిగేదీ లేదు.. తరిగేది లేదన్న అంబటి ఆయన వేషాలు అందరూ చూసేశారన్నారు. ఆయనను నమ్మి జనం మోస పోరని అంబటి రాంబాబు అన్నారు. ఇంత అనైతిక రాజకీయ నేత దేశంలోనే ఎవరూ ఉండరని అంబటి రాంబాబు అన్నారు. పవన్ మళ్లీ భీమవరంలో పోటీ చేస్తే ఓటమి ఖాయమని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు.
Next Story

