Thu Mar 19 2026 11:56:29 GMT+0530 (India Standard Time)
పవన్ ట్వీట్లకు మంత్రుల కౌంటర్
పవన్ కల్యాణ్ ట్వీట్లపై మంత్రి అంబటి రాంబాబు మండి పడ్డారు. పవన్ చేసిన ట్వీట్ కు అంబటి కౌంటర్ ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్ ట్వీట్లపై మంత్రి అంబటి రాంబాబు మండి పడ్డారు. పవన్ చేసిన ట్వీట్ కు అంబటి కౌంటర్ ట్వీట్ చేశారు. ప్యాకేజీల కోసం మొరిగే వాళ్లకు గర్జన అర్థమవుతుందా? అని ట్వీట్ చేశారు. మూడు రాజధానులతో ఇంకా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికా? దేనికీ గర్జనలు అంటూ పవన్ చేసిన ట్వీట్ కు అంబటి రాంబాబు స్పందించారు.
మూడు రాజధానులంటే...
మరో మంత్రి అమరనాథ్ కూడా పవన్ కల్యాణ్ ట్వీట్ లపై మండి పడ్డారు. దేశ రాజధాని ముంబయి అని, అంతర్జాతీయ రాజధాని మాస్కో అని, పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంటూ పవన్ కల్యాణ్ పై సెటైర్ వేశారు. మియావ్ .. మియావ్ దత్తపుత్రుడు అంటూ అమర్ నాథ్ వ్యాఖ్యానించారు.
Next Story

