Sat Dec 20 2025 10:47:34 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీకాళహస్తిలో కొత్త పరిశ్రమ
కాళహస్తిలో జూన్ 23హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ పరిశ్రమకు సీఎం జగన్ భూమి పూజ నిర్వహిస్తారని మంత్రి అమర్ నాధ్ తెలిపారు

శ్రీకాళహస్తిలో ఈనెల 23న హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ పరిశ్రమకు సీఎం జగన్ భూమి పూజ నిర్వహిస్తారని మంత్రి గుడివాడ అమర్ నాధ్ తెలిపారు. మంత్రి అమర్ నాధ్ ఏపీఐఐసీ కార్యాలయంలోని మంత్రి ఆఫీసులో హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులతో చర్చించారు. కోవిడ్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. 298 ఎకరాల విస్తీర్ణంలో శ్రీకాళహస్తి మండలంలోని ఇనగలూరులో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుందని ఆయన తెలిపారు.
700 కోట్ల పెట్టుబడులతో....
ఈ పరిశ్రమ 700 కోట్ల పెట్టుబడులు పెడుతుందన్నారు. దీనివల్ల స్థానిక యువతకు పది వేల మందికి ఉపాధి లభిస్తుందని అమర్నాధ్ తెలిపారు. ఏపీకి మరిన్ని పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ పరిశ్రమలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని, రానున్న కాలంలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆయన అన్నారు. యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాయన్నారు.
Next Story

