Thu Dec 18 2025 23:00:36 GMT+0000 (Coordinated Universal Time)
బాబువి నీచ రాజకీయాలు.. మంత్రి ఆళ్ల నాని ధ్వజం
చంద్రబాబు నీచ రాజకీయాలకు ఈనాడు వంత పాడుతుందని మంత్రి ఆళ్లనాని అన్నారు

చంద్రబాబు నీచ రాజకీయాలకు ఈనాడు వంత పాడుతుందని మంత్రి ఆళ్లనాని అన్నారు. కేవలం నలుగురు మరణిస్తే పదిహేడు మంది చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జంగారెడ్డి గూడెంలో మరణాలపై అసెంబ్లీలో మంత్రి ఆళ్ల నాని స్టేట్ మెంట్ ఇచ్చారు. గుండెపోటుతో మరణిస్తే అక్రమ మద్యం తాగి మరణించాడంటూ తప్పుడు కథనాలను ప్రచురించారన్నారు. జంగారెడ్డిగూడెంలో మరణాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ఆళ్లనాని చెప్పారు. టీడీపీకి కొన్ని పత్రికలు వంతపాడుతున్నాయని చెప్పారు.
బురద చల్లేందుకు....
ప్రభుత్వంపై బురద చల్లేందుకు శవ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబుపై మంత్రి ఆళ్లనాని ధ్వజమెత్తారు. ఈనాడు వంటి పత్రిక కూడా దిగజారి తప్పుడు రాతలు రాస్తుందని చెప్పారు. ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. అభూతకల్పనలతో ప్రజలను ఈనాడు పత్రిక భయాందోళనకు గురి చేస్తుదని చెప్పారు. జంగారెడ్డిగూడెంలో అక్రమ మద్యం తాగి ఎవరూ మరణించలేదని ఆళ్లనాని ప్రకటించారు.
Next Story

