Fri Mar 06 2026 14:45:32 GMT+0530 (India Standard Time)
కాపుల సంక్షేమానికి కూటమి సర్కార్ కట్టుబడి ఉంది
కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి సవిత తెలిపారు

కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి సవిత తెలిపారు. శాసనమండలిలో ఒకప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. 2014-19 మధ్య విదేశీ విద్య కింద 1585 మంది కాపు విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించామన్నారు. నాడు 5 ఏళ్లలో రూ.153.11 కోట్లు కేటాయించారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం 81 మంది కాపు విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్యా పథకం వర్తింప జేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత 331 మంది కాపు విద్యార్థులకు విదేశీ విద్యా పథకం బకాయిలు అందజేశామని తెలిపారు.
కాపుల అభివృద్ధికి...
2024-25లో కాపు సంక్షేమానికి రూ.4,440.25 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 2025-26లో కాపులకు రూ.5,571.48 కోట్లు కేటాయించడమైనదని, 2014-19లో సీఎం చంద్రబాబు... కాపు భవనాల నిర్మాణాలకు నిధులిచ్చారన్నారు. తరవాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాపు భవనాల నిర్మాణాలను పున:ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వం కాపుల కోసం ఏడాదికి రూ.3,580 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కూటమి ప్రభుత్వం రూ.5,017 కోట్లు కేటాయిస్తోందని తెలిపారు.
Next Story

