Sat Jan 31 2026 07:52:22 GMT+0000 (Coordinated Universal Time)
కాకాణికి షాకిచ్చిన అధికారులు
నెల్లూరు జిల్లా వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మైనింగ్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు

నెల్లూరు జిల్లా వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మైనింగ్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. కాకాణి గోవర్థన్ రెడ్డితో సహా పలువురు వైసీపీ నేతలకు రూ.53.33 కోట్ల రూపాయలు జరిమానా విధించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈదగాలి, రామదాసుకండ్రిగలో అక్రమ గ్రావెల్ తవ్వకాల వ్యవహారంలో వైసీపీ నేతలకు మైనింగ్ శాఖ అధికారులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
అక్రమ మైనింగ్ పేరుతో...
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరుతోనూ అనుమతులు తీసుకుని అక్రమ తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు. వైసీపీ హయాంలో పట్టించుకోని అధికారులు.. కూటమి పాలనలో విజిలెన్స్, మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారుల విచారణ జరిగింది. దీంతో మైనింగ్ శాఖను చర్యలు తీసుకోవాల్సిందిగా విజిలెన్స్ డీజీ ఆదేశించారు.
Next Story

