Wed Mar 18 2026 20:57:41 GMT+0530 (India Standard Time)
MIM ; ఏపీలో ఎవరికి ఓటేయాలో చెప్పిన అసద్
ముస్లిం,దళిత రిజర్వేషన్లపై చంద్రబాబు కుట్ర అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

ముస్లిం,దళిత రిజర్వేషన్లపై చంద్రబాబు కుట్ర అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం ఓటర్లు జగన్ కే ఓటేయాలని అసదుద్దీన్ ఒవైసీ పిలుపు నిచ్చారు. చంద్రబాబు పచ్చి రాజకీయ అవకాశవాది అని, తన స్వలాభం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని ఆయన పేర్కొన్నారు.
ముగ్గురిదీ..
చంద్రబాబు, జనసేన, బీజేపీది ఒకటే ఎజెండా అని, ముస్లింలు, దళితులకు రిజర్వేషన్లు ఉండకూడదనేదే వీరి కుట్ర అని అసదుద్దీన్ ఫైర్ అయ్యారు. అన్ని కులాలు, మతాలను సమానంగా చూసే లీడర్ జగన్ అని, ళితులు,ముస్లింలు వైఎస్ జగన్ కు మద్దతుగా నిలబడాలని ఒవైసీ పిలుపు నిచ్చారు. దళితులు, ముస్లింలు అభివృద్ధి చెందాలని జగన్ ఆకాంక్షిస్తున్నాకరని, ఏపీ ప్రజలంతా జగన్ కు ఓటేయాలని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు.
Next Story

