Sat Mar 21 2026 00:14:42 GMT+0530 (India Standard Time)
జగన్ పాలన సూపర్
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జగన్ పాలనకు మంచి మార్కులేశారు. ముఖ్యమంత్రి జగన్ మంచి పాలనను అందిస్తున్నారని అన్నారు

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జగన్ పాలనకు మంచి మార్కులేశారు. ముఖ్యమంత్రి జగన్ మంచి పాలనను అందిస్తున్నారని అన్నారు. జైలులో ఉన్న చంద్రబాబును ఎన్నడూ నమ్మలేమన్న అసదుద్దీన్ ఒవైసీ ఆయన అక్కడే హ్యాపీగా ఉన్నారన్నారు. ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసునన్న అసద్ ప్రజలు కూడా ఆయనను నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఏపీలో రెండే పార్టీలు అధికారంలో ఉన్నాయని, ఒకటి టీడీపీ, మరొకటి వైసీపీ అని తాము వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు.
ఏపీలో కూడా...
ఆంధ్రప్రదేశ్ లో కార్యకర్తలు పనిచేయాల్సి ఉందని అసద్ పిలుపునిచ్చారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. తమ పార్టీ కార్యకర్తలను, నేతలను వేధిస్తున్న బీఆర్ఎస్ నేతలను గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు. తమతో మంచిగా ఉంటే చేయి ఇస్తామని, అలాగని స్నేహం పేరుతో మోసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్కు తమ మద్దతు ఉంటుదన్న అసద్ కేసీఆర్ తెలంగాణలో మంచి పాలన అందిస్తున్నాడని తెలిపారు.
Next Story

