Sun Mar 15 2026 22:45:21 GMT+0530 (India Standard Time)
మంత్రి పినిపె విశ్వరూప్ కు బ్రెయిన్ స్ట్రోక్.. హైదరాబాద్ కు తరలింపు
మంత్రి పినిపె విశ్వరూప్ కు చికిత్స చేసిన వైద్యులు.. ఆయన స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురైనట్లు తేల్చారు.

ఏపీ రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. శుక్రవారం అమలాపురంలో నిర్వహించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను రాజమండ్రి (రాజమహేంద్రవరం) లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించారు.
మంత్రి పినిపె విశ్వరూప్ కు చికిత్స చేసిన వైద్యులు.. ఆయన స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురైనట్లు తేల్చారు. రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు.. మంత్రి కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Next Story

