Fri Dec 05 2025 09:33:38 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మిధున్ రెడ్డి విదేశీ పర్యటనపై తీర్పు
వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు చెప్పేనుంది

వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు చెప్పేనుంది. అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై సిట్ అధికారులు కూడా తమ అభిప్రాయాన్ని న్యాయస్థానానికి తెలియజేశారు. సిట్ కౌంటర్ దాఖలు చేయడంతో నేడు ఏసీబీ కోర్టు అమెరికా పర్యటనకు మిధున్ రెడ్డికి అనుమతి ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి.
అమెరికాకు వెళ్లేందుకు...
ఐక్యరాజ్యసమితి నిర్వహించే జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ కు వెళ్లేందుకు అనుమతివ్వాలని వేసిన పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశముంది. మిధున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉండటంతో పాటు బెయిల్ పై ఉన్నారు. పాస్ పోర్టును అప్పగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకూ న్యూయార్క్ లో నిర్వహించే సమావేశాలకు ఆహ్వానం అందడంతో తనకు విదేశీపర్యటనకు అనుమతివ్వాలని పిటీషన్ వేశారు.
Next Story

