Sun Mar 22 2026 17:32:24 GMT+0530 (India Standard Time)
మళ్లీ భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడురోజుల్లో వర్షాలు పడతాయిన తెలిపింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడురోజుల్లో వర్షాలు పడతాయిన తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో గుంటూరు, కృష్ణా, విజయనగరం, విశాఖ పట్నంలో జిల్లాల్లో నిన్నంతా వర్షాలు పడ్డాయి.
మూడు రోజుల పాటు....
మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలోనూ ఈరోజు, రేపు ఒక మోస్తరు జల్లులు కురిసే అవకాశముందని చెప్పింది.
Next Story

