Sun Dec 14 2025 00:26:26 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : మరోమూడు రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతంలో మాత్రమే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటంతో ఆ ప్రభావంతో మరో మూడురోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరుగానూ, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, అందువల్ల విద్యుత్తు స్థంభాల వద్ద ఎవరూ నిలబడరాదని కూడా అధికారులు హెచ్చరించారు.
మోస్తరు వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానంగా ఉత్తర కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని కూడా వెల్లడించింది. దక్షిణ కోస్తా ప్రాంతంలోనూ నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వెల్లడించింది. ఇక రాయలసీమ ప్రాంతంలో ఈరోజు తేలికపాటి జల్లులు పడతాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ప్రాంతాల్లో వర్షాలు...
తెలంగాణలోనూ మరో మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, జనగాం, హన్మకొండ , వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది.
Next Story

