Mon Mar 16 2026 13:35:41 GMT+0530 (India Standard Time)
మరో అల్పపీడనం.. జనం గుండెల్లో దడ.. మళ్లీ ఏపీకే ఎఫెక్ట్
వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది

వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, చిత్తూరు, తిరుపతిలో ఒక మోస్తరు నుండి భారీ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కృష్ణా జిల్లాలో...
ఇకా కృష్ణా జిల్లా వరదల నుంచి తేరుకోలేదు. మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు భయపడిపోతున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీరు కొంత తగ్గుముఖం పడుతున్న దశలో మళ్లీ వర్షాలు పడితే ఇబ్బందులు పడతామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 6వ తేదీకి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.
Next Story

