Sun Mar 22 2026 10:45:59 GMT+0530 (India Standard Time)
Weather Report : వానలు నేడు కూడా .. భిన్నమైన వాతావరణం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. దీంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నేడు కూడా నమోదవుతాయని తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాల్లో వాతావరణం కూల్ గా మారింది. మరికొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేటి వరకూ వానలు పడతాయని, రేపటి నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని తెలిపింది.
రెండు రోజుల పాటు వానలు
నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు కూడా రాష్ట్రంలో పలు చోట్ల వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రధానంగా తీర ప్రాంతాలు, రాయలసీమలో ఈదురు గాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలోనూ రెండు రోజులు...
తెలంగాణలోనూ రెండు రోజుల పాటు వానలు పడే అవకాశముందని చెప్పింది. కొన్ని జిల్లాలకే మోస్తరు వానలు పడతాయని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు ముప్ఫయి నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశముందని, మరికొన్ని చోట్ల పిడుగులు పడతాయని కూడా చెప్పింది. రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకోవాలని, పొలాలకు వెళ్లే పశువుల కాపర్లు, రైతులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని తెలిపింది.
Next Story

