Sat Mar 07 2026 17:33:18 GMT+0530 (India Standard Time)
నేడు ఎండ మండిపోతుందట
ఆంధ్రప్రదేశ్ లో నేడు ఎండతీవ్రతతో పాటు వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ లో నేడు ఎండతీవ్రతతో పాటు వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 125 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బయటకు వెళితే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
వడగాల్పులు...
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండి పోతున్నాయి. మే రాకమునుపై భానుడి భగభగలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు కూడా సూచిస్తున్నారు. నాలుగు మండలలాల్లో తీవ్రస్థాయిలో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story

