Sun Mar 15 2026 09:54:04 GMT+0530 (India Standard Time)
Weather Report : విస్తారంగా వర్షాలు.. మూడు రోజుల పాటు ఒకటే వాన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొంత వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశముందని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పంది. పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ కోస్తాలోనూ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రాయలసీమలో చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.
తెలంగాణలోనూ మూడు రోజులు...
తెలంగాణలో రేపటి నుంచి మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. జనగామ, యాదాద్రి భువనగిరి, హన్మకొండ, సిద్ధిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల తర్వాత నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Next Story

