Tue Mar 17 2026 02:32:28 GMT+0530 (India Standard Time)
ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అన్ని చోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది

ఆంధ్రప్రదేశ్ లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అన్ని చోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని, ఐదారు జిల్లాలు మాత్రం ఇందుకు మినహాయింపు అని స్పష్టం చేశారు. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం, మన్యం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.
ఈ జిల్లాల్లో మాత్రం....
ఇక నెల్లూరు జిల్లలో కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటు ప్రకాశం, గుంటూరు, కడప, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రం ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
Next Story

