Sat Dec 06 2025 07:25:17 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : మరో మూడు రోజులు భారీ వర్ష సూచన...వచ్చే నెల రెండో వారం నుంచి కుండపోత తప్పదట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నేడుఉత్తర బంగాళా ఖాతం లో ఏర్పడనున్నఅల్పపీడన ప్రభావం తో ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లా లో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ మొదటి వారం లో వర్షాలు తక్కువ గా నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ రెండో వారం నుంచి రెండు రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. రుతుపవనాలు వెనక్కి వెళ్లే అవకాశం కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న హెచ్చరించారు.
కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్...
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీల మేరకు తగ్గే సూచనలున్నట్టు తెలిపారు.ఈరోజు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని, రేపు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందనికూడా వాతావరణ శాఖ హెచ్చరించింది.
బలమైన ఈదురుగాలులు...
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు వీచే అవకాశముందని, హైదరాబాద్ లో నేడు కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నాయని తెలిపింది. రాయలసీమలోనూ భారీ వర్షాలు పడతాయని, ఉరుములతో కూడిన వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశముందని కూడా హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడ అలెర్ట్ జారీ చేసింది. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా రైతులు తమ పంటలను జాగ్రత్తగా కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది.
Next Story

