Thu Mar 19 2026 08:51:12 GMT+0530 (India Standard Time)
మూడు గంటల్లో భారీ వర్షం: రెయిన్ అలర్ట్
రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షం భారీగానే పడుతుందని చెప్పింది. నిన్న కూడా వడగళ్లవాన కురిసింది. ఇప్పటికే రెండు రాష్ట్రల్లో పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొన్ని జిల్లాల్లో వడగండ్ల వానలు కురియడంతో రైతులకు భారీగా పంట నష్టం వాటిల్లింది.
ఏపీ లో భారీ వర్షం...
రైతులు అనేకమంది నష్టపోయారు. రానున్న మూడు గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచన ఉందని.. పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది..
Next Story

