Sun Mar 15 2026 17:54:20 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలే
ఆంధ్రప్రదేశ్ లో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ వెల్లడించింది.
రాయలసీమ, కోస్తాంధ్రలోనూ...
భారీ వర్షాలు కొన్ని చొట్ల, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ వాఖ శాస్త్రవేత్త ఎస్. కరుణ సాగర్ తెలిపారు. రాయలసీమ కోస్తాంధ్ర లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Next Story

