Mon Mar 16 2026 16:52:43 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ గాలుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ గాలుల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మోస్తరు వర్షాలే...
అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయని తెలిపారు. ఈ నెల 8వ తేదీ నాటికి దేశమంతటా నైరుతి రుతు పవనాలు విస్తరించాల్సి ఉండగా ముందే విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Next Story

