Sat May 24 2025 13:32:21 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : వీడని వర్షం ముప్పు.. ఈరోజు కూడా తప్పదట
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి పూట ఎండలు, సాయంత్రం వేళ వర్షం కురుస్తుందని పేర్కొంది. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రకమైన వాతావరణ పరిస్థితులు ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలోనూ ఉంటాయని చెప్పింది. అంటే రెండు రాష్ట్రాల్లోనూ భిన్నమైన పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పింది. కొన్నిప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా పేర్కొంది.
పగటి పూట భారీ ఉష్ణోగ్రతలు...
పగటి పూట భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో నలభై నుంచి నలభై మూడు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు బయటకు రావడమే మంచిదని సూచిస్తున్నారు. అదే సమయంలో సాయంత్రం వేళకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, చెట్ల కింద నిలబకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మరో రెండు రోజులు...
తెలంగాణలోనూ మరో రెండు రోజుల పాటు వడగళ్లతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నెల 12వ తేదీ వరకూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పినా ఎల్లుండి నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రధానంగా దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. కొన్నిజిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. బలమైన ఈదురుగాలులువీస్తాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణలోని పథ్నాలుగు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Next Story