Wed Mar 18 2026 20:39:55 GMT+0530 (India Standard Time)
Weather Report : నాలుగు రోజులు వర్షం ముప్పు.. వేడిగాలుల తీవ్రత తప్పదన్న వాతావరణ శాఖ
రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పగలు ఉష్ణోగ్రతలు గరిష్టంగానమోదవుతూనే, సాయంత్రానికి వర్షాలు పడతాయని లేటెస్ట్ గా వెదర్ రిపోర్టు లో వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని కూడా తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లోరానున్న నాలుగు రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టం చేశారు. దీంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.
ఈ ప్రాతంలో వర్షాలు...
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెిపింది. ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల పడే అవకాశముందని చెప్పింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. అలాగే రాయలసీమ ప్రాంతాల్లో రానున్న వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి పూట ఉష్ణోగ్రతల్లో కూడా మార్పు ఉండే అవకాశముందని చెప్పింది.
తెలంగాణలో వేడిగాలులు...
తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని కూడా వెల్లడించింది. అలాగే పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా చెప్పింది. అలాగే వేడిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Next Story

