Mon Mar 16 2026 09:54:51 GMT+0530 (India Standard Time)
Rain Alert : నేడు ఏపీకి వర్ష సూచన.. ఎక్కడెక్కడంటే?
ఆంధ్రప్రదేశ్ లో నేడు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్ లో నేడు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల చిరుజల్లులతో కూడిన వర్షం పడుతుందని, మరికొన్ని చోట్ల సాధారణ వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. అయితే ఏపీకి మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది.
అల్పపీడన ప్రభావం....
ఈ నెల 20వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ఈ నెల 22వ తేదీ కల్లా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశముందని తెలపింది. దీంతో ఏపీలో వర్షాలు పడతాయని, ఈ నెల 21వ తేదీ నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Next Story

