Sat Mar 07 2026 08:08:10 GMT+0530 (India Standard Time)
Rain Alert : ఏపీలో మూడు రోజుల వర్షాలేనట
ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీగానూ, మరికొన్ని చోట్ల మోస్తరు గానూ, ఇంకొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు కూడా బలంగా వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ ప్రభావంతో...
ఇందుకు ప్రధాన కారణం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ ఛత్తీస్గఢ్, ఒడిశా స్రాంతంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే భారీవర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని, ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని తెలిపింది.
Next Story

