Tue Mar 17 2026 02:49:43 GMT+0530 (India Standard Time)
మూడు రోజులు వర్షాలే
ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ శ్రీలంక నుంచి ఈశాన్య మధ్యప్రదేశ్ వరకూ సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని తెలిపింద.ి దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
తెలంగాణలోనూ...
అలాగే ఈరోజు, రేపు కూడా తెలంగాణలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. ఏపీలో అయితే పిడుగులు కూడా పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
Next Story

