Wed Jan 28 2026 20:05:50 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : వానలు వదలవు.. రేపు మరో అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్ - ఒడిశా తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతందని తెలిపింది. దీంతో ఈ నెల 2వ తేదీన వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
విశాఖ వాతావరణ కేంద్రం...
రేపు అల్పపీడన ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాలో తేలికపాటి జల్లులు పడతాయని కూడా తెలిపింది. అయితే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని, వాతావరణ శాఖ సూచన మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, కాల్వలు పొంగి పొరలుతున్నాయి. ఎవరూ వాటిని దాటే ప్రయత్నం కాని, ఈత కొట్టేందుకు సాహసం చేయవద్దని పేర్కొంది.
తెలంగాణానూ మూడు రోజులు...
తెలంగాణలోనూ మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నేడు కూడా వర్షాలు పడతాయని పేర్కొంది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల,భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్ పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Next Story

