Tue Mar 17 2026 04:12:51 GMT+0530 (India Standard Time)
మరో మూడు రోజులు వర్షాలే
ఆంధ్రప్రదేశ్ కు మరో మూడు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్ కు మరో మూడు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవన ద్రోణితో పాటు అల్పపీడనం కారణంగా ఈరోజు, రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రుతుపవన ద్రోణి ఒడిశాలో విస్తరించి ఉందని, ఇది బంగాళాఖాతానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఏపీలో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. రేపు, ఎల్లుండి ఒక మోస్తరు వానలు పనే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలోనూ...
ఇక తెలంగాణలోనూ మరో రెండురోజుల పాటు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు భారీగా వర్షాలు కురుస్తాయని, రేపు ఒక మోస్తరుగా వర్షాలు పడతాయని పేర్కొంది. చురుగ్గా కదులుతున్న రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో గత వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Next Story

