Fri Dec 05 2025 19:40:10 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ.. మళ్లీ భారీ వర్షాలు
వాతావరణ శాఖ మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ నెల 13వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది.

వాతావరణ శాఖ మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ నెల 13వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది. ఇప్పటికే వరస అల్పపీడనాలు ఏర్పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. మళ్లీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం కూడా అప్రమత్తయింది. బంగాళాఖాతంలో ఈ నెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని, ఆ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నాలుగు రోజులు తేలిక పాటి జల్లులు పడే అవకాశముందని పేర్కొంది.
రెండు రోజుల నుంచి ఉక్కపోత...
ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కొంత పెరిగాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పింది. అలాగే ఉక్కపోత కూడా ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే 13న బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లోనే వర్షాలు...
తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వర్షం లేకపోవడంతో సాయంత్రం వేళ ఉక్కపోత వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు కూడా రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే 13వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో సంగారెడ్డి, నల్లగొండ, హన్మకొండ, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ములుగు, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జనగాం, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.
Next Story

