Thu Mar 19 2026 08:35:02 GMT+0530 (India Standard Time)
నేడు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు
నేడు కోస్తా, రాయలసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది

నేడు కోస్తా, రాయలసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరాఠ్వాడా మీదుగా కర్ణాటక వరకూ ఏర్పడిన ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని తెలిపింది.
ఈదురుగాలులు...
అయితే ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ఉక్కబోత, ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్న రాయలసీమ వాసులకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించనున్నాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
Next Story

