Tue Jun 06 2023 12:18:18 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లోని మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ లోని మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే అన్నమయ్య జిల్లా, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనను చేసింది.
మరో మూడు రోజులు...
మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. శ్రీలంక, తమిళనాడు తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Next Story