Wed Mar 18 2026 19:21:46 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏపీలో మూడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు
దిత్వా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది

దిత్వా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర తీర ప్రాంతంలో గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నట్లు వాతావరణ శాఖ సమాచారం అందించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బలమైన గాలులు...
దిత్వా తుపాను ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ పశ్చిమ బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన ఈ తునున్ ఉత్తర–ఉత్తర పశ్చిమ దిశగా వేగంగా కదులుతోంది. ప్రస్తుతం ఇది శ్రీలంకలోని త్రింకోమలీకి 80 కిలోమీటర్లు వాయువ్యంగా, పుదుచ్చేరికి 330 కిలోమీటర్లు దక్షిణ–ఈశాన్యంగా, చెన్నైకి 430 కిలోమీటర్లు దక్షిణంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Next Story

