Sat Dec 13 2025 22:33:22 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : తెలుగు రాష్ట్రాలకు బ్యాడ్ న్యూస్... మరో అల్పపీడనం ఇక్కడే
మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది

మొంథా తుపాను నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. మరో అల్పపీడనం రేపు ఏర్పడనుందని తెలిపింది. ఈ నెల 4వ తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడతాయని వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది.
మరో మూడు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని విశాఖ వాతారణ శాఖ తెలిపింది. ఈరోజు ఉత్తరకోస్తాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది. దక్షిణ కోస్తా ప్రాంతంలో తేలికపాటి వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని కూడా వెల్లడించింది. రాయలసీమలోనూ మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు పడతాయని వాతవరణ శాఖ అంచనా గా ఉంది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శఆఖ హెచ్చరించింది.
ఈ ప్రభావంతో ఇక్కడ...
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు అండమాన్ లో అల్పపీడనం ఏర్పడితే ఆ ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది. అండమాన్ లో ఏర్పడే అల్పపీడనం బలపడితే భారీ వర్షాలు మరోసారి తెలంగాణను వణికిస్తాయని కూడా అంచనా వేస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. అయితే ఈ ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని, తమ పంటలను కాపాడుకునేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
Next Story

