Sat Dec 06 2025 01:06:10 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 25న దుర్గగుడి మూసివేత
ఈ నెల 25న దుర్గగుడిని మూసివేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ నెల 25న దుర్గగుడిని మూసివేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. దుర్గగుడి ఆలయంతో పాటు ఉపాలయాలను కూడా మూసివేయనున్నామని వారు తెలిపారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటలకకు మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేస్తామని తెలిపారు.
మధ్యాహ్నం తర్వాతే...
26వ తేదీ ఉదయం ఆరు గంటలకు తిరిగి దుర్గగుడితో పాటు ఉపాలయాలు కూడా తెరుచుకుంటాయని వారు వివరించారు. ఆలయం తెరిచిన వెంటనే భక్తులకు దర్శనం ఉండదని, నిత్య అలంకరణ, అమ్మవారికి స్నపనాభిషేకం, పూజా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 12.10 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ కమిటీ తెలిపింది. ఆరోజు ఉదయం అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Next Story

