Tue Mar 10 2026 02:24:22 GMT+0530 (India Standard Time)
మండలిలోనూ అదే సీన్
శాసనమండలిలోనూ తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారు

శాసనమండలిలోనూ తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని వారు పట్టుబడుతున్నారు. కానీ మండలి ఛైర్మన్ మాత్రం అంగీకరించకపోవడంతో టీడీపీ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. నినాదాలు చేశారు. పంచాయతీరాజ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, సర్పంచ్లు సమస్యలను పరిష్కరించాలని, మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ నినాదాలు చేశారు.
నినాదాలు చేస్తూ...
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానం పై చర్చ జరుగుతుందని, దయచేసి సభ్యులు సహకరించాలని పదే పదే కోరినా టీడీపీ సభ్యులు మాత్రం వినలేదు. ఉపాధ్యాయ సంఘాల ఎమ్మెల్సీలు కూడా వీరితో జత కలిశారు. ఉపాధ్యాయ, అంగన్వాడీ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలంటూ వారు నినాదాలు చేశారు. మెగా డీఎస్సీని వెంటనే ప్రకటించాలని వారు కోరారు. దీంతో శాసనమండలి ఛైర్మన్ పది నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.
Next Story

