Tue Dec 16 2025 23:44:21 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : టీడీపీ సభ్యుల సస్పెన్షన్
తొలి రోజు అసెంబ్లీ సమావేశాలలోనే టీడీపీ సభ్యులు సస్పెండ్ కు గురయ్యారు

తొలి రోజు అసెంబ్లీ సమావేశాలలోనే టీడీపీ సభ్యులు సస్పెండ్ కు గురయ్యారు. ముగ్గురు సెషన్ మొత్తం సస్పెండ్ కాగా, మిగిలిన వారు ఒక్కరోజు సస్పెండ్ అయ్యారు. సభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమయినా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను విరమించకపోవడం, స్పీకర్ పోడియం వద్ద నిల్చొని నినాదాలు చేయడంతో స్పీకర్ అందరినీ సస్పెండ్ చేశారు.
ఆ ముగ్గురు...
దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ లను సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు జారీ చేశారు. సభ జరిగినన్ని రోజులు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన తర్వాత కూడా సభ్యులు సభ నుంచి వెళ్లకపోవడంతో మార్షల్స్ వచ్చి వారని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సభలో ప్రస్తుతం ఇంకా గందరగోళ పరిస్థితి నెలకొంది.
Next Story

