Thu Jan 29 2026 01:47:28 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking : షాకింగ్ ...వైసీపీకి ఎంపీ గుడ్ బై
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సభ్యుడు రాజీనామా చేశారు. కర్నూలు ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ రాజీనామా చేశా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సభ్యుడు రాజీనామా చేశారు. కర్నూలు ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన ఎంపీ పదవితో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. సంజీవ్ కుమార్ గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన ఈ సారి ఎమ్మిగనూరు స్థానాన్ని ఆశించారు.
గత ఎన్నికల్లో...
అయితే ఎమ్మిగనూరు స్థానాన్ని ఇవ్వకపోగా, కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా గుమ్మనూరి జయరాంను నియమించారు. దీంతో సంజీవ్ కుమార్ పార్టీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. కర్నూలు ప్రాంతంలో ఆయనకు వైద్యుడిగా మంచి పేరుంది. అందుకే గత ఎన్నికల్లో జగన్ పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చారు. మరి ఆయన ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తికరంగా మారింది. సంజీవ్ కుమార్ చేనేత సామాజికవర్గానికి చెందిన వారు. ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతుంది.
Next Story

