Sun Mar 15 2026 14:29:16 GMT+0530 (India Standard Time)
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా?
తమ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే లేదని పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి తెలిపారు.

తమ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే లేదని పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి తెలిపారు. రోబో డైనర హోటల్ తయారు చేసిన మొబైల్ యాప్ ను మిధున్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమను ప్రజలు ఐదేళ్లు అధికారంలో ఉండేందుకే ఎన్నుకున్నారని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు అవసరం ఏముందని మిధున్ రెడ్డి ప్రశ్నించారు.
పార్టీని కాపాడుకునేందుకు.....
అయితే చంద్రబాబు తన పార్టీని కాపాడుకునేందుకు నాలుగు నెలలకు ఒకసారి ముందస్తు ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తుంటారని మిధున్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అనుకుంటే ముందస్తు ఎన్నికలు జరగవని తెలిపారు. ఇక సినిమా టిక్కెట్ల వ్యవహారాన్ని ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుందని మిధున్ రెడ్డి తెలిపారు.
Next Story

