Mon Mar 16 2026 08:01:32 GMT+0530 (India Standard Time)
సీఐడీకి గోరంట్ల కు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ సీఐడీకి పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు

ఆంధ్రప్రదేశ్ సీఐడీకి పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై అసత్య ప్రచారం చేసి ఇబ్బందులకు గురి చేశారని, మానసికంగా ఇబ్బంది పెట్టారని ఆయన సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రతిష్టకు భంగం వాటిల్లిందని...
తనపై ఒక వీడియోను క్రియేట్ చేసి దానిని సర్క్యూలేట్ చేశారని, దాని వల్ల తన ప్రతిష్టకు భంగం వాటిల్లిందని గోరంట్ల మాధవ్ తెలిపారు. తనపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గోరంట్ల మాధవ్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సీఐడీ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
Next Story

