Sun Mar 15 2026 16:56:23 GMT+0530 (India Standard Time)
నేడు మేకపాటి నామినేషన్
ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి నేడు మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.

ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి నేడు మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి పలువురు మంత్రులు, వైసీపీ నేతలు హాజరు కానున్నారు. మంత్రిగా ఉండి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మ కూరు ఉప ఎన్నిక అనివార్యమయింది. గత ఏడాది ఫివ్రవరి 21వ తేదీన మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఈ నెల 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది.
పోటీ ఉండటంతో....
మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని ఆ కుటుంబం పార్టీ అధినేత జగన్ ను కోరింది. ఆ మేరకు ఆయనను అభ్యర్థిగా జగన్ ఖరారు చేశారు. నిన్న బిఫారం కూడా జారీ చేశారు. మేకపాటి కుటుంబంలోనే టిక్కెట్ ఇవ్వడంతో తెలుగుదేశం, జనసేన పోటీకి దూరంగా ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం తమ పార్టీ నియమావళిని అనుసరించి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని చిన్నా చితకా పార్టీలు కూడా నామినేషన్లు వేశాయి. దీంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈరోజు మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.
Next Story

